ENGLISH

సెగ పుట్టించే 'హేట్‌' అందాలివిగో!

14 February 2018-17:30 PM

ఈ ఫోటోలో హాట్‌గా పోజిచ్చిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా? 'హేట్‌ స్టోరీ 4' చిత్రంలోని హీరోయిన్‌ ఇహానా థిల్లాన్‌. ఈ సినిమాలోనే మరో హీరోయిన్‌గా నటిస్తోంది ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెల్లా. ఇదో అడల్ట్‌ కంటెన్ట్‌ సినిమా. అడల్ట్‌ కంటెన్ట్‌ అనగానే హాట్‌నెస్‌ని కొంచెం ఎక్కువగానే ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. కానీ ఈ సినిమాలోని హాట్‌నెస్‌ని ఊహించడమే కష్టం. అందుకే శాంపిల్‌కి ఓ డోస్‌ వదిలారు. ఈ నెల 12న ఈ సినిమా నుండి 'తుమ్‌ మేరీ హో..' అనే సాంగ్‌ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఆ సాంగ్‌లో ముద్దుగుమ్మ ఇహానా థిల్లాన్‌ అందాల ఆరబోతకు ఆకాశమే హద్దని చెప్పాలి. అందుకే ఈ సాంగ్‌ వీడియోకి ఏకంగా 44 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇంత తక్కువ టైంలో ఈ వ్యూస్‌ చాలా ఎక్కువ అనే చెప్పాలి. అందుకే ఈ భామ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఐటెంగా మారిపోయింది.మరో బ్యూటీ ఊర్వశీ రౌతెల్లా కూడా తక్కువేం చేయలేదండోయ్‌. ఇద్దరూ పోటా పోటీగా అందాలారబోసేస్తుంటే, ఆ దాడిని తట్టుకోవాలంటే, రొమాంటిక్‌ ప్రియులకు కూసింత కష్టమైన ప్రక్రియే అవుతోంది మరి.