ENGLISH

'జై లవ కుశ' ఫస్ట్‌ లుక్‌

19 May 2017-19:16 PM

చేతికి బేడీలు, ఆ చేతిలో సన్‌ గ్లాసెస్‌, వెనకాల రావణుడి బొమ్మ. ఇది 'జై లవ కుశ' ఫస్ట్‌ లుక్‌. ఎన్టీయార్‌ పుట్టినరోజు సందర్భంగా 'జై లవ కుశ' సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఇంతకు ముందే సినిమా టైటిల్‌ని ఫస్ట్‌ లుక్‌లో విడుదల చేసినప్పటికీ, అందులో ఎన్టీయార్‌ లేడు. కాబట్టి అది టైటిల్‌ లుక్‌గా భావించాలి. ఇదే అసలు సిసలైన ఫస్ట్‌ లుక్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ అదిరిపోయే లుక్‌ని విడుదల చేశారని అభిమానులు అంటున్నారు. ఈ లుక్‌తో ఫ్యాన్స్‌ చాలా సంతృప్తి చెందారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి ఆశించినట్టుగానే అరుదైన గిఫ్ట్‌ని అందించాడు. అయితే ఎన్టీఆర్‌ మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో నటిస్తున్నారు ఈ సినిమాలో. ఆ మూడు గెటప్‌లు ఈ రోజే రివీల్‌ కానున్నాయని అభిమానులు ఆశించారు. అయినప్పటికీ విడుదల చేసిన లుక్‌ అదుర్స్‌. నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీయార్‌ త్రిపాత్రాభినయం చేస్తుండడం గమనించదగ్గ అంశం. అందులో ఒకటి నెగెటివ్‌ టచ్‌ ఉన్న పాత్రగా ప్రచారంలో ఉంది. ఎన్టీయార్‌ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఫస్ట్‌ లుక్‌ విడుదలయ్యాక సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. చాలా పవర్‌ ఫుల్‌గా ఎన్టీఆర్‌ పాత్ర ఉండబోతోందని అర్ధమైపోయింది. 

ALSO READ: `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18M`లో 'జార్జ్'గా కిషోర్