ENGLISH

'జై లవకుశ' అసలు పండగ మొదలైంది

22 September 2017-15:45 PM

మామూలుగా సినిమాలు శుక్రవారం రిలీజ్‌ అవుతాయి. ఎందుకంటే శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో వసూళ్ల పరంగా సేఫ్‌ జోన్‌లో ఉండాలని. కానీ 'జై లవకుశ' సినిమాని గురువారం రిలీజ్‌ చేశారు. గురువారం రిలీజ్‌ చేయడమంటే కొంచెం రిస్క్‌తో కూడుకున్న పనే. కానీ సినిమాపై ఎంతో నమ్మకం ఉంటేనే ఇలాంటి సాహసం చేస్తారు. అందులోనూ ఈ రోజు వర్కింగ్‌ డే. నిన్న తొలి రోజు కాబట్టి ఓపెనింగ్‌ వసూళ్లు బానే వచ్చాయి. అయితే ఈ రోజే అసలు సిసలు పరీక్ష ఎన్టీఆర్‌కి. ఈ పరీక్షని ఎన్టీఆర్‌ ఎలా పాసవుతాడో చూడాలి. ఈ రోజు అన్ని చోట్లా హౌస్‌ఫుల్స్‌ నమోదైనట్లైతే 'జై లవకుశ' అద్భుత రికార్డులు సాధించినట్లే. మిక్స్‌డ్‌ టాక్‌ వస్తున్నా కానీ, ఆ టాక్‌ వసూళ్లపై ఏమాత్రం ప్రభావితం చేయడం లేదనే చెప్పాలి. సూపర్‌ హిట్‌ స్థాయిలో వసూల్లు ఆదరగొడుతున్నాడు. ఈ ఒక్కరోజు పరీక్షలో పాస్‌ అయితే ఎన్టీఆర్‌, ఇక రేపట్నుంచీ ఎలాగూ హాలీడేస్‌. సో ఖచ్చితంగా ధియేటర్లు హౌస్‌ఫుల్స్‌ కావడం గ్యారంటీ. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా వ్యవహరించారు. రాఖీ ఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ రోల్‌కి ఫ్యాన్స్‌ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఒకే స్క్రీన్‌పై మూడు గెటప్పుల్లో ఎన్టీఆర్‌ని ఒకేసారి చూసి ఫ్యాన్స్‌ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.

ALSO READ: ఎన్టీఆర్‌ కొల్లగొట్టుడు పక్కా!