ENGLISH

అజ్ఞాతవాసి టీం పైన ఫ్రెంచ్ దర్శకుడి ఆగ్రహం

19 January 2018-13:35 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టీంని ఫ్రెంచ్ దర్శకుడు లార్గో వించ్ ఇప్పటిలో వదిలేలా కనపడట్లేదు. ఇప్పటికే ఈ సినిమా తాను తీసిన చిత్రానికి దాదాపుగా దగ్గరిగా ఉందంటూ చెప్పి సంచలనం సృష్టించాడు.

తన చిత్రం అలాగే అజ్ఞాతవాసి ఒకేలా ఉందంటూ చెప్పినప్పటికీ, ఈ చిత్రం కాపీరైట్స్ విషయమై తనతో అజ్ఞాతవాసి టీం సంప్రదించకపోవడం చాలా దారుణం అని చెప్పాడు. ఇదే సమయంలో T-సిరీస్ తో ఇప్పటికే అజ్ఞాతవాసి టీం సంప్రదించింది అని వారి మధ్య సెట్టిల్మేంట్ కూడా జరిగింది అని కొందరు ఆయనకీ మెసేజ్ పెట్టినప్పటికీ ఈ సినిమాని అంతర్జాతీయంగా విడుదల చేసినప్పుడు ఇది చెల్లదు అని ఆయన కొట్టిపారేస్తున్నారు.



దీనితో అజ్ఞాతవాసి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడడమే గాక ఇప్పుడు ఈ కాపీరైట్స్ విషయంలో కూడా ఇలా అవుతుండడం నిజంగా ఈ సినిమా నిర్మాతలకి పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ సమయంలో అజ్ఞాతవాసి టీం నుండి ఏదైనా స్పందన వస్తుందా లేదా అన్నది చూడాలి.

ఏదేమైనా... పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం అభిమానులకే గాక నిర్మాతలకి సైతం ఓ పీడ కలగా మారిపోయింది.

 

ALSO READ: మహేష్ కత్తి పైన దాడి చేసింది ఎవరు?