ENGLISH

రూటు మార్చిన అందాల చందమామ

17 July 2017-18:03 PM


గ్లామరస్‌ హీరోయిన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్‌ అగర్వాల్‌, టాలీవుడ్‌లో తన అందచందాలతో పదేళ్ళకు పైగానే సత్తా చాటుతోంది. తెలుగుతోపాటు, తమిళ, హిందీ చిత్రాల్లోనూ కాజల్‌ నటించింది. స్టార్‌ హీరోలతోనే కాకుండా కొత్త తరహా కథలొస్తే ఎవరితో అయినా కలిసి నటించడానికి తాను సిద్ధమంటోంది తాజాగా కాజల్‌, ఆ దిశగా అడుగులేస్తోంది కూడా. ఇంతవరకూ స్టార్‌ హీరోలకు మెయిన్‌ ఆప్షన్‌గా ఉన్న ముద్దుగుమ్మ కాజల్‌, ఇకపై కుర్రహీరోలతోనేఊ నటించేందుకు రెడీ అంటోంది. అవునులే కాజల్‌ కాకపోతే ఇంకెవరు నటిస్తారు చెప్పండి. వయసు పెరిగినా తరగని అందం ఆమెది. ఇంకో వైపున కాజల్‌, లేడీ ఓరియెంటెడ్‌ కథాంశాలపై కూడా దృష్టిపెట్టింది. ప్రముఖ దర్శకుడు పి.వాసు, కాజల్‌ అగర్వాల్‌తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీ అది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుందట. హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేయనున్నారట. తమిళంలో ముద్దుగుమ్మ నయనతార ఈ తరహాలోనే దూసుకెళ్లిపోతోంది. అదే దారిలో ఇప్పుడు టాలీవుడ్‌లో కాజల్‌ నడవబోతోందన్న మాట. తెలుగులో కాజల్‌, ప్రస్తుతం 'ఎంఎల్‌ఎ' సినిమాలో నటిస్తోంది. కళ్యాణ్‌రామ్‌తో జత కడుతోంది ఈ సినిమాలో కాజల్‌. హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది కూడా కళ్యాణ్‌రామ్‌ సినిమాతోనే. మళ్లీ ఇన్నాళ్లకు తన తొలి హీరోతో కాజల్‌ జత కడుతుండడం విశేషం. అన్నట్లు త్వరలోనే రానాతో కాజల్‌ నటిస్తోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా ఆగష్టులో విడుదలకు సిద్ధంగా ఉంది.

ALSO READ: నితిన్ ‘లై’ని ఎంతకు కొన్నారో తెలుసా?