ENGLISH

కియారా అద్వానికి బంపర్ ఆఫర్

20 April 2018-07:00 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో నటి కియారా అద్వాని తెలుగు చిత్రసీమకి పరిచయం అవుతున్నది.

ఇప్పటికే ఈ చిత్రం తాలుకా ప్రచార చిత్రాలలో మహేష్ సరసన చూడచక్కగా ఉండడంతో ఈమెకి మంచి మార్కులే పడ్డాయి అని చెప్పొచ్చు. ఇక తొలిచిత్రం తోనే మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడుకి ఈ చిత్రం విడుదల కాకముందే మరో భారీ తెలుగు చిత్రంలో నటించే బంపర్ ఆఫర్ ని కొట్టేసింది.

ఆ చిత్రం మరెంటో కాదు- #RRR. ఈ భారీ మల్టీ స్టారర్ పైన ఇప్పటికే అందరికి అంచనాలు ఆకాశాన్ని అంటుకునే స్థాయిలో ఉండగా అలాంటి చిత్రంలో ఈ అమ్మడుకి అవకాశం రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. మరి ఇంతటి అవకాశాన్ని హీరోయిన్ కియారా అద్వాని ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.  

ఇక ప్రస్తుతానికి కియారా అద్వానికి రేపటి భరత్ అనే నేను విడుదల సందర్భంగా గుడ్ విషెస్..

 

ALSO READ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీ రెడ్డి?!