ENGLISH

జపాన్ లో చిరంజీవి: కేటీఆర్ ట్వీట్

18 January 2018-17:51 PM

మెగాస్టార్ చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అని మళ్ళీ కొత్తగా చెబితే ఆయన గురించి తెలిసిన వారు ఎవరైనా అనే ఒకే మాట- “ఏదైనా  తెలియనిది ఉంటే చెప్పు.. అంతేతప్ప అందరికి తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పకు అని”.

ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా ఇంతవరకు ఎవరికి తెలియనిదే. అదే జపాన్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి మూవీ పోస్టర్. వివరాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రస్తుతం జపాన్ దేశంలోని ప్రముఖ సంస్థల వారిని కలుస్తున్నారు. అక్కడివారిని ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టె అంశం పైన వారితో చర్చలు జరుపుతున్నారు. 

ఈ పర్యటనలో భాగంగా జపాన్ దేశంలోని ఒక పట్టణంలో ఉన్న సుజుకి మ్యుజియంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా పోస్టర్ కనపడడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా అందరితోను పంచుకుంటూ, అక్కడ దిగిని ఫోటోని సైతం షేర్ చేశారు.

దీన్నిబట్టి చూస్తే.. మన మెగాస్టార్ కి జపాన్ లో కూడా అభిమాన ఘనం భారీగానే ఉన్నట్టు అర్ధమైతున్నది.

 

ALSO READ: నా పేరు సూర్య శాటీలైట్ రేటు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే