ENGLISH

హాట్‌ అండ్‌ ట్రెండీ రత్తాలు

17 January 2018-11:04 AM

హాట్‌నెస్‌కి అయినా, క్యూట్‌నెస్‌కి అయినా, బబ్లీనెస్‌కి అయినా 'రత్తాలు' అప్పటికప్పుడు 'స్పెసల్‌ లుక్‌' సంతరించుకోగలదు. అదే ఆమె ప్రత్యేకత. పక్కా మాస్‌ 'రత్తాలు'గా కన్పించినా, అల్టిమేట్‌ స్టైల్‌ ఐకాన్‌లా సత్తా చాటినా రాయ్‌ లక్ష్మీ అలియాస్‌ లక్ష్మీరాయ్‌ రూటే సెపరేటు. ఇదిగో ఈ లుక్‌లో అల్ట్రా మోడ్రన్‌గా కన్పిస్తూనే, అందులోనూ ట్రెడిషనల్‌ లుక్‌తో లక్ష్మీరాయ్‌ మెరిసిపోతోంది. 'కాంచనమాల కేబుల్‌ టీవీ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని తొలిసారిగా పలకరించిన లక్ష్మీరాయ్‌, టాలీవుడ్‌లో తనకు మేగ్జిమమ్‌ గుర్తింపు 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలోని 'రత్తాలు' ఐటమ్‌ సాంగ్‌ ఇచ్చిందనీ, ఆ పాటని ఎప్పటికీ మర్చిపోలేననీ, 'రత్తాలు' అంటూ తనను అంతా పిలుస్తోంటే ఆ కిక్‌ చాలా కొత్తగా అన్పిస్తుంటుందని చెబుతుంటుంది. ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్‌లో 'జూలీ-2' సినిమాలో కనిపించినా ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. త్వరలో మరో భారీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో సందడి చేస్తానంటున్న లక్ష్మీరాయ్‌ ఈలోగా పలు బాలీవుడ్‌ ఈవెంట్స్‌లో కన్పిస్తూ, హాట్‌ అండ్‌ స్పైసీగా అవకాశాలకు గాలమేస్తోంది.

ALSO READ: Qlik Here For The Gallery