ENGLISH

అందాల 'హాట్‌' బుల్లెట్టూ కిర్రాక్‌ పుట్టేట్టూ.!

16 July 2018-11:00 AM

'కాంచనమాల కేబుల్‌టీవీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ రాయ్‌ లక్ష్మీ. తొలి సినిమాలోనే ఫుల్‌ డోస్‌ గ్లామర్‌ యాంగిల్‌ చూపించేసిందీ ముద్దుగుమ్మ. కానీ తెలుగులో పెద్దగా అవకాశాలు చేజిక్కించుకోలేకపోయింది. తమిళంలో లారెన్స్‌ పుణ్యమా అని 'కాంచన' సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవల బాలీవుడ్‌లో నటించిన 'జూలీ 2' సినిమా రాయ్‌ లక్ష్మీకి హాట్‌గాళ్‌ ఇమేజ్‌ తెచ్చి పెట్టింది. సక్సెస్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా, రాయ్‌ లక్ష్మి కెరీర్‌లో ఊహించని పాపులారిటీని సంపాదించి పెట్టింది. అంతకు ముందే అమ్మడు తెలుగులో నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌ తెలుగు ప్రేక్షకులకు రాయ్‌ లక్ష్మిని మరింత దగ్గర చేశాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా కాకున్నా, రిజిస్టర్ట్‌ అండ్‌ ఇంపార్టెంట్‌ పాత్రలతో త్వరలోనే సందడి చేయనుంది అందాల రాయ్‌ లక్ష్మి. తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ పిక్‌ విషయానికి వస్తే, టాప్‌ టూ బాటమ్‌ జీన్స్‌ ప్యాటర్న్‌తో, మేచింగ్‌ హై హీల్స్‌తో హాట్‌ బుల్లెట్టులా కిర్రాక్‌ పుట్టించేస్తోంది.

ALSO READ: Qlik Here For The Gallery Of Lakshmi Rai