ENGLISH

ప్రజల మనిషి పవన్‌: లావణ్య త్రిపాఠి

18 January 2018-18:11 PM

ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి సోషల్‌ మీడియాలో అభిమానులతో సరదాగా చిట్‌ చాట్‌ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు క్యూట్‌ క్యూట్‌గా సమాధానాలిచ్చింది. 

పవన్‌ కళ్యాణ్‌ గురించి మీ అభిప్రాయమేంటని ఓ అభిమాని లావణ్యని అడగ్గా, 'పవన్‌ ప్రజల మనిషి' అని సమాధానమిచ్చింది. స్టార్‌ హీరో నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో నటించింది ఈ బ్యూటీ. పవర్‌స్టార్‌తో నటించే అవకాశం ఎప్పుడు దక్కించుకుంటుందో మరి. అల్లు అర్జున్‌ డాన్సులంటే చాలా ఇష్టమంటోంది. కానీ అల్లు అర్జున్‌తో డాన్స్‌ చేసే అవకాశం అమ్మడికింకా రాలేదు పాపం. ముందు ముందు ఆ ఛాన్స్‌ కూడా ఈ అమ్మడి ఖాతాలో పడుతుందేమో. 

హీరోయిన్స్‌లో అయితే, రాశీఖన్నా క్యూట్‌నెస్‌ అంటే తనకెంతో ఇష్టమట. రాశీఖన్నా తనకి మంచి స్నేహితురాలు అంటోంది లావణ్య. మహేష్‌బాబుని 'డాషింగ్‌' అని అభివర్ణించింది. ఫేవరేట్‌ హీరో ఎవరని అడిగితే తమిళ హీరో సూర్య నా ఫేవరేట్‌ అని ఠకీమని సమాధానమిచ్చింది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఇన్ని కబుర్లు చెబుతున్న ఈ అందాల భామ ఇంతవరకూ ప్రేమలో పడలేదంట. తనకి అన్ని విధాలా తగ్గ కుర్రోడు ఇంకా దొరకలేదంట. అందుకే ప్రేమించలేదంటోంది. 

రీల్‌ లైఫ్‌లో లవ్‌స్టోరీస్‌లో ఎక్కువగా కనిపించిన ఈ బ్యూటీ రియల్‌ లైఫ్‌ ప్రేమని దక్కించుకునే ఆ అదృష్టవంతుడెవ్వరో కానీ. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్‌తేజ్‌తో 'ఇంటెలిజెంట్‌' సినిమాలో నటిస్తోంది. వినాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: కత్తి మహేష్ ని టార్గెట్ చేసిన పూనమ్ కౌర్..!