ENGLISH

యాక్షన్‌ థ్రిల్లర్‌లో రొమాంటిక్‌ హీరో

17 July 2017-18:05 PM


విలక్షణ చిత్రాల డైరెక్టర్‌ మణిరత్నం, రొమాంటిక్‌ హీరో మాధవన్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన చిత్రాలు మంచి సక్సెస్‌ అందుకున్నాయి. ముఖ్యంగా మ్యూజికల్‌ హిట్స్‌గా చెప్పొచ్చు ఈ సినిమాలు. 'సఖి, యువ', అమృత' వంటి సినిమాలు ఈ కాంబినేషన్‌లో తెరకెక్కాయి. లేటెస్టుగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా అట. ప్రస్తుతం మాధవన్‌ కోలీవుడ్‌ సినిమాలతో పాటు, బాలీవుడ్‌లోనూ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఇకపోతే మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన 'చెలియా' సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. కార్తీ హీరోగా తెరకెక్కింది ఈ సినిమా. అయితే ఈ సారి మణిరత్నం, మాధవన్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మాత్రం అంచనాలు నమోదు చేస్తోంది బీభత్సమైన యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో పాటు, ఒళ్లు గగుర్పొడిచే థ్రిల్లింగ్‌ అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ఇంతవరకూ మాధవన్‌ నటించని కొత్త పాత్రలో కనిపించబోతున్నాడట ఈ సినిమాలో. అందుకే ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమాకి ఎ. ఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్‌ అదనపు ఆకర్షణ కానుంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా రూపొందిస్తున్నారట.

 

ALSO READ: నితిన్ ‘లై’ని ఎంతకు కొన్నారో తెలుసా?