ENGLISH

మహానుభావుడు ఆడియో విడుదల ఎప్పుడో తెలుసా?

13 September 2017-19:10 PM

శర్వానంద తాజా చిత్రం మహానుభావుడుకి సంబందించిన ఒక అప్డేట్ మీకోసం.

అదేంటంటే- మహానుభావుడు ఆడియో విడుదల ఈ నెల 16వ తేదిన జరగనుంది. దీనికి బాహుబలి ప్రభాస్ ముఖ్యఅతిధిగా హజరుకానుండడం విశేషం. ఇప్పటికే తమన్ అందించిన ట్యూన్స్ చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి.

ఇక మహానుభావుడు టీజర్ ఈ చిత్రం కథను క్లుప్తంగా చెప్పడం అలాగే మహానుభావుడు కి సంబందించిన స్టిల్స్ కూడా ఫ్రెష్ గా ఉండడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

మరీ ఈ చిత్ర ఆడియో వేడుక ఆడియన్స్ లో ఇంకెన్ని అంచనాలు పెంచనున్నాయో చూడాలి.

 

ALSO READ: ఆసుపత్రిలో అర్జున్ రెడ్డి హీరోయిన్!