ENGLISH

2018 అని చెప్పేసిన మహేష్!

25 September 2017-18:22 PM

స్పైడర్ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ ఉన్న మహేష్ కి ఒక ప్రశ్న మాత్రం అన్ని ఇంటర్వ్యూ లలో కామన్ గా ఎదురవుతున్నది. అదే దర్శకుడు రాజమౌళితో కలిసి ఎప్పుడు పనిచేయబోతున్నారు అని.

ఇక ఈ విషయమై వస్తున్న ఊహాగానాలకు మహేష్ తెరదింపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రశ్నకి సమాధానం చెబుతూ- తాను ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా వున్నాను అని, ఇవి షూటింగ్ పూర్తిచేసుకునే సరికి 2018 ద్వీతీయభాగం అవుతుందని తెలిపాడు.

ఇక ఆ సమయంలోనే తమ ఇద్దరి కలయికలో ఒక చిత్రం వస్తుంది అని చెప్పేశాడు. మరి ఈ రెండు చిత్రాలు పూర్తయ్యేసరికి రాజమౌళి ఇంకేదైనా చిత్రం చేస్తాడా లేక వెయిట్ చేస్తాడా అన్నది తెలియాల్సిఉంది.

ఏదైతేనేమి.. వీరి కలయికలో చిత్రం ఉంటుందా లేదా అన్న ప్రశ్నకి అయితే సమాధానం దొరికేసింది.

 

ALSO READ: జై లవకుశ నాలుగు రోజుల కలెక్షన్స్