ENGLISH

సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఇక ఆగడు

27 May 2017-13:28 PM

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు దూకుడు పెంచేశాడు. 'స్పైడర్‌' సినిమా కొంచెం ఆలస్యమైనప్పటికీ, ఇకపై వచ్చే సినిమాల విషయంలో స్పీడు పెంచనున్నాడట. వరుస పెట్టి సినిమాలు చేస్తానంటున్నాడు మహేష్‌. మురుగదాస్‌తో చేస్తున్న 'స్పైడర్‌' సెప్టెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కాకుండానే, కొత్త సినిమాని ఆల్రెడీ పట్టాలెక్కించేశాడు మహేష్‌. అదే కొరటాల శివతో తెరకెక్కుతున్న 'భరత్‌ అను నేను'. ఈ సినిమా టైటిల్‌తోనే చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నాడు మహేష్‌. గతంలో మహేష్‌ - కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. ఈ సారి రాబోయే సినిమా అంతకు మించి ఉండబోతోందట. ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్‌ పరంగా పొలిటికల్‌ సబ్జెక్ట్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మహేష్‌ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడనీ సమాచారమ్‌. ఇదిలా ఉండగా, మరో పక్క మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడంట. ప్రస్తుతం త్రివిక్రమ్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్‌ - మహేష్‌ది కూడా సూపర్బ్‌ కాంబినేషన్‌. సో ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలున్నాయి. గతేడాది 'బ్రహ్మూెత్సవం' సినిమాతో నిరాశ పరిచినప్పటికీ, రాబోయే చిత్రాలతో సూపర్‌ స్టార్‌ పక్కా ప్లానింగ్‌తో వస్తాడట. నో వే ప్లానింగ్‌ అస్సలు మిస్‌ కాదంటున్నాడట మహేష్‌. ఇంకేం మహేష్‌ ఫ్యాన్స్‌కి అంత కన్నా కావాల్సిందేముంది!

 

ALSO READ: బిగ్ బీ ని అడ‌గ‌నే లేద‌ట‌!