ENGLISH

సూపర్‌ స్టార్‌ పుత్రోత్సాహం

20 July 2017-12:23 PM

పిల్లలు చిన్నప్పుడు చేసే అల్లరి ఎంతో ముద్దు ముద్దుగా ఉంటుంది. బాల్యంలో తెలిసీ తెలియక పిల్లలు చేసే అల్లరి చేష్టలు ఎంతో ఆనందాన్నిస్తాయి తల్లితండ్రులకి. ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నా పిల్లలతో కాస్సేపు గడిపితే చాలు ఆ ఒత్తిడి అంతా పటాపంచలయిపోతుంది. అందుకే సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, తన గారాల పట్టి సితార పుట్టినరోజు తనకెంతో స్పెషల్‌ అంటున్నారు. ఈ రోజు మహేష్‌ కూతురు సితార ఐదవ పుట్టినరోజు. తన చిన్నారి పాపకి మహేష్‌ సోషల్‌ మీడియాలో బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. 'తను నాకెప్పుడూ ప్రత్యేకమే. తనకి ఈ రోజు ప్రత్యేకం. నా చిట్టితల్లి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి..' అంటూ మహేష్‌ ట్వీట్‌ చేస్తూ, కూతురుతో దిగిన ఫోటోలను పోస్ట్‌ చేశాడు. మరో పక్క సితార తల్లి, మహేష్‌ భార్య అయిన నమ్రతా తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల క్రితమే, చేతులకు అందంగా గోరింటాకు పెట్టించుకుని, ఫోటోలకు నవ్వుతూ పోజిచ్చిన పిక్స్‌ని షేర్‌ చేసింది. అలాగే పట్టు పరికిణీలో సితార ఐదో సంవత్సరం వైపు.. అని ట్వీట్‌ చేసింది నమ్రత. మొత్తానికి సూపర్‌ స్టార్‌ గారాల కూతురి పుట్టినరోజు సంతోషాన్ని ఆయన కుటుంబ సభ్యులతోనే కాకుండా, అభిమానులతో కూడా ఆనందంగా పంచుకున్నారు. మహేష్‌ ప్రస్తుతం 'స్పైడర్‌' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకి ఎ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోన్న చిత్రమిది. 

ALSO READ: తెలుగులోకి వస్తున్న అజిత్ వివేకం