ENGLISH

కోన వెంకట్ ని ప్రశ్నించిన కత్తి మహేష్

17 January 2018-13:00 PM

లేటెస్ట్ సెన్సేషన్ అయిన మహేష్ కత్తి వారం రోజుల విరామం తరువాత మళ్ళీ తెరపైకి వచ్చాడు. రైటర్ కోన వెంకట్ సూచించినట్టుగా తాను జనవరి 15వ తేదీ వరకు మౌనం వహిస్తాను అని చెప్పడం మనం చూసాము. 

ఇక నిన్న 16వ తేదీన ఒక టీవీ ఛానల్ కి వెళ్ళడం మళ్ళీ ఇదే అంశం పై చర్చిండం కూడా జరిగింది. ఇక ఇది పక్కన పెడితే, కొద్దిసేపటి క్రితం, తన సమస్యకి ఎటువంటి పరిష్కారం చూపనున్నారు అని రైటర్ కోన వెంకట్ ని మహేష్ కత్తి ట్విట్టర్ సాక్షిగా ప్రశ్నించాడు.



దానికి వెంటనే స్పందించిన కోన వెంకట్, నేను చెప్పిన విధంగా మీరు మౌనంగా ఉండకుండా ఛానల్లో కనపడడం, విద్యార్ధి సంఘాలతో మాట్లాడడం వంటివి చేసిన దానిని మౌనం అని ఎలా అంటారు అని అయన తిరిగి ప్రశ్నించాడు. 



దీనికి తిరిగి మహేష్ కత్తి తనదైన శైలిలో రిప్లై ఇవ్వడం జరిగింది.

మొత్తానికి ఈ అంశం ఇప్పుడు అప్పుడే ముగిసేలా కనిపిస్తలేదు.

ALSO READ: పవన్ కళ్యాణ్ ని డబ్బులు కట్టమంట్టున్నారట