ENGLISH

'స్పైడర్‌' బైలింగ్వల్‌ ఎందుకంటే..

25 September 2017-11:22 AM

తెలుగు సినీ పరిశ్రమకి ఉన్న మార్కెట్‌ని బట్టి ఈ సినిమాకి బైలింగ్వల్‌ చేశామని అంటున్నారు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న 'స్పైడర్‌' మూవీ బైలింగ్వల్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే అన్ని సినిమాలకూ ఇలా సాధ్యం కాదు. నేటివిటీ పరంగానే కాకుండా, ఇతరత్రా కమర్షియల్‌ అంశాల పరంగానూ ఈ సినిమాకీ అన్నీ అలా సెట్‌ అయ్యాయి అంతే. ఈ సినిమాకి సెట్‌ అయినట్లుగా ఏ సినిమాకీ సెట్‌ కాదనీ మహేష్‌ అంటున్నారు. కాస్టింగ్‌ దగ్గర్నుంచీ, నేటివిటీ పరంగా 'స్పైడర్‌' ఓ అద్భుతమైన సినిమా అంటున్నారాయన. అలాగే తమిళంలోని స్టార్‌ హీరోస్‌తో పోటీ పడాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదనీ, 'స్పైడర్‌' ఓ మంచి సినిమా, అలాంటి సినిమాని రెండు భాషల్లో తెరకెక్కించాలన్నది ఓ గొప్ప ఆలోచన. ఆ ఆలోచనకి పోసిన ప్రాణమే 'స్పైడర్‌'. తెలుగుతో పాటు, తమిళంలోనూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను ఆని సూపర్‌స్టార్‌ అన్నారు. టాలెంటెడ్‌ డైరెక్టర& మురుగదాస్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా ఓ క్రెడిట్‌గా మిగిలిపోతుందనీ మహేష్‌ అన్నారు. ఎస్‌.జె.సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. భరత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది 'స్పైడర్‌'.

ALSO READ: అసలు సూపర్ స్టార్స్ అంటే వాళ్ళే: మహేష్ బాబు