ENGLISH

ప‌వ‌న్ సినిమాలో మ‌మ్ముట్టి??

29 May 2017-13:19 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ ల కాంబోలో సినిమా అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబో నుంచి రెండు సూప‌ర్ హిట్లొచ్చాయి. ఈసారి హ్యాట్రిక్ ఖాయం అంటున్నారంతా. దానికి త‌గ్గ‌ట్టే ఈ సినిమా విష‌యంలో త్రివిక్ర‌మ్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌ల‌నీ తీసుకొంటున్నాడు. స్టార్ కాస్టింగ్ ప‌రంగా ఎక్క‌డా ఎలాంటి లోటు రాకుండా చూసుకొంటున్నాడు. ఇప్ప‌టికే ఖుష్బూని రంగ ప్ర‌వేశం చేయించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు మ‌మ్ముట్టిని కూడా రంగంలోకి దింపే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టాక్‌. ఈ సినిమాలో మ‌మ్ముట్టికి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింద‌ని, ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ తండ్రి పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. మ‌రి ఇది ఒట్టి గాసిప్పేనా, లేదంటే ఇందులో నిజాలేమైనా ఉన్నాయా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

ALSO READ: శివగామి పాత్ర కోసం శ్రీదేవి ఎంత అడిగిందో తెలుసా!