ENGLISH

యంగ్ హీరోకి తల్లిగా మీనా?

12 August 2017-19:23 PM

ఒకప్పుడు హీరోయిన్స్ గా రిటైర్ అయిన 10-15 యేండ్లకి మళ్ళీ తల్లి పాత్రల్లో నటించేవారు, కాని  ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్స్ గా మార్కెట్ తగ్గిన 5-8 యేండ్లకే యంగ్ హీరోస్ కి తల్లి పాత్రలకి ఇప్పటితరం హీరోయిన్స్ ఒకే చెప్పేస్తున్నారు.

ఉదాహరణకి నదియా, రాశి, రమ్యకృష్ణ ఇప్పుడు అదే జాబితాలో మీనా కూడా చేరనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ కలయికలో రానున్న చిత్రంలో హీరోకి తల్లి పాత్రలో మీనా కనపడనుంది అని టాక్.

అధికారికంగా ఈ విషయం బయటకి రానప్పట్టికి మీనా ఈ చిత్రంలోనటిస్తుండడం పక్కా అని సమాచారం. చూద్దాం.. యంగ్ హీరోస్ కి తల్లిగా మీనా కెరీర్ ఎంతవరకు వెళ్ళనుందో..

 

ALSO READ: నేనే రాజు నేనే మంత్రిలో ‘ఆ’ డైలాగ్ కి అనూహ్య స్పందన