ENGLISH

అక్కినేని బుల్లోడికి సాటెవ్వరు!

21 April 2017-19:36 PM

అక్కినేని బుల్లోడనగానే అయితే అక్కినేని అఖిల్‌గానీ లేదంటే అక్కినేని నాగచైతన్య అనిగానీ అనుకోవచ్చు ఎవరైనా. కానీ నాగార్జున లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో పెట్టిన ఫొటోలు చూస్తే, అక్కినేని బుల్లోడంటే అక్కినేని నాగార్జున మాత్రమే అని చెప్పక తప్పదు. ఎప్పుడో చాలాకాలం క్రిందట వచ్చిన 'శివ' సినిమాలో నాగార్జున ఎలా ఉన్నారో, ఇప్పుడూ ఆయన అలాగే ఉన్నారు. ఈ వయసులో నాగార్జున ఇంత హ్యాండ్సమ్‌ లుక్‌, ఇంత పెర్‌ఫెక్ట్‌ పర్సనాలిటీ ఎలా మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అక్కినేని నాగార్జున టాలీవుడ్‌ 'మన్మథుడు' అనడం అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరికైనా డౌట్లు ఉంటే, ఈ ఫొటో చూసి ఆ డౌట్లు తీర్చేసుకోవచ్చు. 'రాజుగారి గది-2' సినిమాలో నటిస్తోన్న నాగార్జున, షూట్‌ పూర్తి చేసుకున్న విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ కొన్ని ఫొటోల్ని షేర్‌ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సరసన అందాల భామ సీరత్‌కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్‌ బ్యూటీ సరసన, అక్కినేని బుల్లోడు మరింత హ్యాండ్సమ్‌గా వెలిగిపోతున్నాడు. అంతెందుకు 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో అందాల రాక్షసి లావణ్య సరసన నాగార్జున నటించి, మెప్పిస్తే 'ఈ వయసులో..' అనే కామెంట్‌ కూడా ఎవరూ చేయలేకపోయారు. అదే అక్కినేని హ్యాండ్సమ్‌ లుక్‌ పవర్‌.