ENGLISH

మళ్ళీ హిట్టు కొట్టి చూపిస్తారట

21 April 2017-19:22 PM

నాని, నివేదా థామస్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'జెంటిల్‌మెన్‌' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇంకో సినిమా 'నిన్ను కోరి'. ఎక్కువగా ఈ సినిమా చిత్రీకరణ విదేశాల్లోనే ప్లాన్‌ చేశారు. అమెరికాలో భారీ షెడ్యూల్‌ పూర్తి చేసిన అనంతరం యూనిట్‌ విశాఖ తీరానికి చేరుకుంది. అందమైన విశాఖ తీరంలో సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ చేపడుతున్నారట. ఈ నెల 29తో మొత్తం సినిమా షూటింగ్‌ పూర్తయిపోతుందని చిత్ర నిర్మాత దానయ్య వెల్లడించారు. జూన్‌ 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 'జెంటిల్‌మెన్‌' తర్వాత నాని, నివేదా థామస్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాతో ఇంకోసారి ఈ జంట హిట్టు కొట్టబోతోందని చిత్ర యూనిట్‌ అంటోంది. ఈ మధ్యకాలంలో హిట్టు మీద హిట్టు కొడుతున్న నాని ఈ సినిమాతో మరో బంపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకోనున్నాడని మనం ఫిక్స్‌ అయిపోవచ్చు. నాని లక్‌ ఆ స్థాయిలో ఉంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. నాని, నివేదా థామస్‌లతోపాటు ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడు. 

ALSO READ: నాని కొత్త రిలీజ్ డేట్ ఇదే