ENGLISH

నారా-కొణిదెల కోడళ్ళ ముచ్చట్లు

18 November 2017-17:36 PM

నారా వారి కోడలు బ్రాహ్మణి అలాగే కొణిదెల వారి కోడలు ఉపాసన ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు.

 

వివరాల్లోకి వెళితే, వీరిరువురు ఈరోజు మధ్యాహ్నం రక్తదానం చేశారు. వీరు చేసిన ఈ పని గురించి ఉపాసన తన సోషల్ నెట్వర్క్ ఎకౌంటు ద్వారా అందరితోను పంచుకుంది. రక్తదానం చేయడం ఎంతో మంచిది అని, ఇలా చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాన్ని నిలబెట్టగలము అని చెప్పింది.

ఇక ఈ ఇద్దరు సమాజంలో జరిగే అన్ని సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు అలాగే తమ కుటుంబాల నుండి వచ్చే కీర్తినే కాకుండా తమ స్వంతంగా కూడా పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ మంచి పేరుని సంపాదిస్తున్నారు.

 

ALSO READ: AP స్పెషల్ స్టేటస్ పైన ప్రకాష్ రాజ్ స్పందన