ENGLISH

రాకుమారి కోసం పోటాపోటీగా..

29 May 2017-16:22 PM


యంగ్‌ హీరోస్‌ నారా రోహిత్‌, నాగ శౌర్యలు మరో హిట్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. 'జ్యో అచ్చుతానంద' సినిమాతో ఈ ఇద్దరూ మంచి విజయం అందుకున్నారు. తాజాగా 'కథలో రాజకుమారి' సినిమా కోసం మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్‌పై పోరాడబోతున్నారు. 'జ్యో' కోసం ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒంటరి పోరాటం సాగించగా, ఈ సినిమాలో రాజకుమారి కోసం పోట్లాడుకోనున్నారట. అయితే ఈ పోట్లాట చాలా ఆశక్తిగా ఉండబోతోందంటున్నారు డైరెక్టర్‌ మహేష్‌ సూరపనేని. ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమే ఇది. ఈ సినిమాలో నారా రోహిత్‌, చాక్లెట్‌ బోయ్‌ నాగశౌర్యలు తమ గెటప్స్‌ని ఛేంజ్‌ చేసుకున్నారు. కొత్త లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. నమితా ప్రమోద్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. నమితా కోసం ఈ ఇద్దరు హీరోలు పడే తపన చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందట. అన్నట్లు ఈ సినిమాలో మ్యూజిక్‌ పెద్ద హైలైట్‌. రెండు పాటలకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ రెండు పాటలు సినిమాని ఉన్నత స్థాయిలో నిలిచేలా చేస్తాయట. వచ్చే నెల 30న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నారా రోహిత్‌ ఈ మధ్యనే 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో విజయం అందుకున్నాడు. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు ఆ సినిమాలో. ఇప్పుడు హీరోగా కనిపిస్తూనే, అక్కడక్కడా నెగిటివ్‌ షేడ్స్‌ కూడా చూపిస్తాడట. రోహిత్‌ నటన సినిమాకే హైలైట్‌ కానుందట. కథ పాతదే అయినా ఏదో కొత్తదనం చూపించారట డైరెక్టర్‌ ఈ సినిమాలో. అదేంటో చూడాలంటే వచ్చే నెలాఖరు వరకూ ఆగాల్సిందే!

 

ALSO READ: ప‌వ‌న్ సినిమాలో మ‌మ్ముట్టి??