ENGLISH

నిహారిక - సుమంత్‌ 'హ్యాపీ వెడ్డింగ్‌'

22 September 2017-17:27 PM

'ఒక మనసు' సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది మెగా హీరోయిన్‌ నిహారిక. నాగబాబు ముద్దుల తనయగా, మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొట్ట మొదటి హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన నిహారికకు తొలి సినిమా నిరాశ మిగిల్చింది. తాజాగా మరో సినిమాతో మన ముందుకు వస్తోంది. యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నిహారిక హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోంది. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ని తెరకెక్కించిన యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌నందిస్తున్నారు. అక్టోబర్‌ 4న ఈ సినిమా స్టార్ట్‌ కానుంది. తొలి సినిమాలో నిహారిక క్యారెక్టర్‌ కొంచెం డల్‌గా, బాగా మెచ్యూర్డ్‌ అమ్మాయిలా ఉంటుంది. కానీ ఈ సారి బబ్లీ గాళ్‌లా, మోడ్రన్‌గా, ఈ తరం అమ్మాయిలు మెచ్చే హీరోయిన్‌గా కనిపించనుందట. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. క్యూట్‌ అండ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్‌ సినిమాకి తనలోని ప్లస్‌లు, మైనస్‌లను కవర్‌ చేసుకుని ఫుల్‌గా మేకోవర్‌ అయ్యిందట నిహారిక. ఇంతవరకూ గ్యాప్‌ తీసుకున్నా, కానీ ఇకపై వరుసగా సినిమాలు చేస్తానంటోంది. ఇప్పటికే నిహారిక లిస్ట్‌లో కొన్ని కథలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు చేస్తాననీ చెబుతోంది మెగా హీరోయిన్‌ నిహారిక.

ALSO READ: 'స్పైడర్‌'కి డిఫరెంట్‌ స్టైల్‌ పబ్లిసిటీ