ENGLISH

అఖిల్ చిత్రంలో మరో నటి

13 September 2017-18:29 PM

అక్కినేని అందగాడు అఖిల్‌ కోసం కొత్త ముద్దుగుమ్మలు క్యూ కట్టారు. అఖిల్‌ కొత్త సినిమా విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే కళ్యాణీ ప్రియదర్శిని అనే కొత్త ముద్దుగుమ్మని ఎంపిక చేశారు. ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మకీ చోటుందట. అందుకోసం మరో కొత్త భామ నివేదిత సతీష్‌ని ఎంచుకున్నట్లు సమాచారమ్‌. సీనియర్‌ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మగలిర్‌ మత్తుమ్‌' చిత్రంలో నటించిందీ బ్యూటీ. 'హలో' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని స్టిల్స్‌ ఇప్పటికే అంచనాలను పెంచుతున్నాయి. నాగార్జున ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై రూపొందుతోందీ చిత్రం. ఈ సినిమాకి భారీ స్థాయిలో పబ్లిసిటీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొల సినిమా 'అఖిల్‌'తో నిరాశ పరిచిన అఖిల్‌ ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. 'అఖిల్‌' సినిమా పరాజయం పాలైనా కానీ తనదైన నటనతో అఖిల్‌ అభామానుల్నిల ఆకట్టుకున్నాడు. 'మనం' సినిమాతో అఖిల్‌కి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌. జస్ట్‌ ఎంట్రీనే అంత ఇన్నోవేటివ్‌గా ఇచ్చాడు. ఇక సినిమా అంతా ఎంత బాగా అఖిల్‌ని ప్రెజెంట్‌ చేసి ఉంటాడో కదా విక్రమ్‌. మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి.

ALSO READ: నటుడు చిన్నా ఇంట్లో విషాదం