ENGLISH

ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల మధ్య మరొకటి?!

12 October 2017-19:44 PM

జై లవకుశ చిత్రంతో తన కెరీర్ లోనే పెద్ద హిట్ సాధించిన ఎన్టీఆర్ తదుపరి చిత్రంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. దీనికి కారణం- అది త్రివిక్రమ్-ఎన్టీఆర్ కలయికలో రానుండడమే.

అయితే వీరు చేయబోయే చిత్రానికి ముందే ఎన్టీఆర్ మరో చిత్రం చేయబోతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఒక పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించనుంది అన్న వార్తలు మాత్రం బలంగా వినవస్తున్నాయి.

దీని పైన స్పష్టత మాత్రం ఎన్టీఆర్ తన కుటుంబంతో విహారయాత్రకి వెళ్ళీ వచ్చాకనే తెలిసే అవకాశం ఉంది ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే గనుక జరిగితే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ మధ్యన ‘మరొకటి’ రానుంది.

 

ALSO READ: పొరపాటున #RGG2 కథ చెప్పేసిన సమంతా!