ENGLISH

బల్గేరియాలో పవర్‌ స్టార్‌

20 July 2017-12:10 PM

పవన్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. యూరోప్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో నటిస్తున్నాడు. యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేసిందట చిత్ర యూనిట్‌. యూరప్‌లోని పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరగనుంది. అలాగే హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌తో ఓ డ్యూయెట్‌ని కూడా అక్కడే చిత్రీకరణ జరపనున్నారట. యూరప్‌లోని భారీ లొకేషన్స్‌ని ఈ సినిమాలో చూపించనున్నారట త్రివిక్రమ్‌ అండ్‌ టీమ్‌. యూరప్‌ షెడ్యూల్‌ పూర్తి కాగానే ఈ సినిమా టైటిల్‌ని అనౌన్స్‌ చేయనున్నారట. 'అత్తారింటికి దారేది' వంటి క్రేజీ టైటిల్‌తో రికార్డు హిట్‌ కొట్టిన పవన్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ ఈ సారి రాబోయే సినిమాకీ కూడా ఓ క్రేజీ టైటిల్‌ని ఆలోచిస్తున్నారట. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమానే. కీర్తి సురేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ్‌ యంగ్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తుండడం విశేషం. అంతేకాదండోయ్‌ ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ షురూ చేసేసింది. అలాగే సంచలనాలు కూడా నమోదు చేసేసింది కూడా. పవన్‌ సరికొత్త లుక్‌లో వెరీ వెరీ స్టైలిష్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌గా కనిపించనున్నాడు ఈ సినిమాలో. 

ALSO READ: తెలుగులోకి వస్తున్న అజిత్ వివేకం