ENGLISH

నలభయ్యేళ్ల హాట్‌ 'యోగం'

25 September 2017-11:13 AM

శరీరాన్ని విల్లులా తిప్పేస్తోంది. హాట్‌ హాట్‌ ఎక్సర్‌సైజులు చేసోస్తోంది ఇంతకీ ఎవరీ బ్యూటీ అనుకుంటున్నారా? వయసు నలభై, ఇంకా పాతికేళ్ల వయసులో ఉండాల్సిన ఫిట్‌నెస్‌తో కనిపిస్తోన్న ఈ బ్యూటీ పేరు పూజా పాత్రా. బాలీవుడ్‌ బ్యూటీ. తెలుగులో నూ నటించింది. నాగార్జునతో 'సిసింద్రీ' సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన బ్యూటీ గుర్తుంది కదా. ఆ బ్యూటీనే ఈ బ్యూటీ. స్వర్గీయ దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌ కుమార్‌తో 'గ్రీకువీరుడు' సినిమాలోనూ నటించింది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు కానీ, అప్పుడప్పుడూ బాలీవుడ్‌ సినిమాల్లో కనిపిస్తోంది. యోగా ఘనతని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఈ యోగాసనాలు. యోగా ఘనత ఎలా ఉన్నప్పటికీ, లేటు వయసులోనూ అమ్మడి హాట్‌ పోజులకి సోషల్‌ మీడియా పిచ్చ హీటెక్కుతోంది.