ENGLISH

ప్రముఖ రచయతకి చైర్మన్ పదవి

12 August 2017-19:50 PM

CBFC చైర్మన్ పదవి నుండి ఎవ్వరు ఊహించని విధంగా పహ్లాజ్ నేహ్లాని ని తప్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ తప్పించడం ఎటువంటి సంచలనం రేపిందో అలాగే ఆ స్థానంలో కొత్తగా నియమించిన నియామకం కూడా చర్చనీయాంశం అయింది.

పహ్లాజ్ ని తప్పించిన వెంటనే ఆ స్థానంలో ప్రముఖ కథా, గీత రచయత అయిన ప్రసూన్ జోషిని నియమించింది ప్రభుత్వం. పహ్లాజ్ తో పోల్చుకుంటే ప్రసూన్ వివదరహితుడే కాకుండా సౌమ్యుడిగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది.

ఇక పహ్లాజ్ సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉన్నత కాలం వివాదాలు అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉడ్తా పంజాబ్ చిత్రం విషయంలో ఆయన తీరుని అందరు తప్పుబట్టారు.

భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు రాకూడదనే ఈ నియామకం జరిపినట్టు సమాచారం. ఇక ఈ సెన్సార్ బోర్డు సభ్యులుగా వామన్, విద్యా బాలన్, వివేక్ & నరేంద్ర కోహ్లి.

ALSO READ: నేనే రాజు నేనే మంత్రిలో ‘ఆ’ డైలాగ్ కి అనూహ్య స్పందన