ENGLISH

సినీ ప్రముఖులు సిట్ విచారణకు హాజరయ్యే తేదీలు!

17 July 2017-21:23 PM

డ్రగ్స్ రాకెట్ లో నోటిసులు అందుకున్న సినీ ప్రముఖులు సిట్ విచారణకు హాజరయ్యే తేదీల వివరాలుబయటకి వచ్చాయి!

జూలై 19 నుండి ఆగష్టు 3 వరకు ఈ సిట్ విచారణకు హాజరవనున్నారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాధ్ (జూలై 19), చార్మీ, ముమైత్ ఖాన్ (జూలై 20), సుబ్బరాజు (జూలై21), శ్యామ్ కె నాయుడు(జూలై 22), రవితేజ (జూలై 23), 24న  శ్రీనివాసరాజు, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, నవదీప్ (జూలై 26), తరుణ్ (జూలై 27), 28న నందు, 29న తనీష్ లు సిట్ విచారణకు హాజరుకానున్నారు.

ప్రతిరోజు విచారణ ఉదయం 10.30కి మొదలవుతుంది అని సిట్ వర్గాల సమాచారం. ఈ విచారణ మొదలయ్యాక ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడతాయి అని అభిప్రాయపడుతున్నారు.

 

ALSO READ: వదంతుల పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్