ENGLISH

సూపర్ స్టార్ ‘మెగా’ ఫ్యాన్స్ మీట్

16 December 2017-17:35 PM

నాలుగు రోజుల క్రితమే తన పుట్టినరోజు జరుపుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక ఈ పుట్టినరోజున తన రాజకీయ ఎంట్రీ పైన ప్రకటన చేస్తాడు అన్న ఊహాగానాల నేపధ్యంలో ఆయన ఎటువంటి ప్రకటన చేయకుండానే ఆరోజు దాటిపోయింది.

దానితో ఇక ఆయన రాజకీయ ప్రవేశం ఇప్పుడు లేనట్టే అన్న విషయం అర్దమై ఆయన అభిమానులు డీలా పడ్డారు. అయితే ఇప్పుడు తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారంగా- సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులతో కలవడానికి సన్నాహాలు చేస్తున్నాడట.

ఇప్పటికే ఒక విడత తన అభిమానులతో భేటి అయిన రజినీకాంత్, ఇప్పుడు మరోసారి తన అభిమానులతో ముచ్చటించబోతున్నాడు. దీనితో మరోసారి ఆయన రాజకీయ రంగప్రవేశం పైన ఆసక్తిగల చర్చ మొదలైంది.

మొత్తానికి ఈయన రాజకీయ రంగప్రవేశం పైన ఇంకా సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.

 

ALSO READ: అనుష్క కి స్పెషల్ గిఫ్ట్ పంపిన దీపిక