ENGLISH

'లస్ట్‌ స్టోరీస్‌' లాంటిదే మరోటి.!

16 July 2018-11:06 AM

ఈ మధ్య డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై విడుదలైన 'లస్ట్‌ స్టోరీస్‌' వీడియో ఓ పక్క వివాదాన్ని, మరో పక్క సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కోవలోనే మరో సినిమా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది కూడా డిజిట్‌ ప్లాట్‌ఫాం పైనే విడుదలైంది. 'సేక్రెడ్‌ గేమ్స్‌' టైటిల్‌తో రూపొంది, ఈ వీడియోలో నటించిన ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? రాజశ్రీ దేశ్‌పాండే. 

గతంలో పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించిందీ హాట్‌ భామ. 'సెక్సీ దుర్గా' అనే సినిమాతో బాగా పాపులర్‌ అయ్యింది. అయితే తాజాగా విడుదలైన 'సేక్రెడ్‌ గేమ్స్‌'లో అమ్మడు న్యూడ్‌గా నటించేసింది. అందుకే ఇప్పుడీ వీడియో సంచలనమైంది. ఈ వీడియోను వీక్షించిన వీక్షకులు అంతా ఈ మెను 'పోర్న్‌ స్టార్‌'గా అభివర్ణించేస్తున్నారట. దాంతో అమ్మడు కాస్త ఫీలయ్యిందట పాపం. హాట్‌గా, న్యూడ్‌గా నటించినంత మాత్రాన పోర్న్‌ స్టార్‌ ట్యాగ్‌ ఇచ్చేస్తారా? అని నెటిజన్లపై మండిపడుతోంది.

అవును నిజమే మరి గతంలోనూ రాధికా ఆప్టే తదితర ముద్దుగుమ్మలు న్యూడ్‌గానూ, టాప్‌లెస్‌గానూ నటించారు. అలా అని వారిని పోర్న్‌ స్టార్స్‌ అనలేం కదా. అలాంటప్పుడు నన్నే ఎందుకు ఇలా అంటున్నారు అని గగ్గోలు పెడుతోంది రాజశ్రీ దేశ్‌పాండే. 'సేక్రెడ్‌ గేమ్స్‌' వీడియోలో తన పాత్రను చాలా చక్కగా రూపొందించాడట డైరెక్టర్‌. 

ఆ పాత్ర తీరు తెన్నులు ఎంతో నచ్చి, ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానంటోందీ హాట్‌ భామ. స్టోరీ డిమాండ్‌ చేయడం వల్లే అలా న్యూడ్‌గా నటించాల్సి వచ్చిందనీ, ఆ కారణంగా 'పోర్న్‌స్టార్‌' అనే ట్యాగ్‌లైన్‌ యాడ్‌ చేసి, తన ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయద్దంటోంది రాజశ్రీ దేశ్‌పాండే.

ALSO READ: టాక్ అఫ్ ది వీక్- విజేత, RX 100 & చినబాబు