ENGLISH

ఆమె తమ్ముడొస్తున్నాడోచ్‌

17 July 2017-16:07 PM


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ నటుడిగా పరిచయం కాబోతున్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ రోజు ఇప్పుడు రానే వచ్చింది. అయితే సినిమాలో కాదులెండి, 'రాక్‌ అండ్‌ రోల్‌' అనే షార్ట్‌ ఫిలింలో అమన్‌ నటిస్తున్నాడు. ఇప్పటికైతే షార్ట్‌ ఫిలిం నటుడే అయినా, ముందు ముందు వెండితెరపైనా నటుడిగా సత్తా చాటాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట అమన్‌. గతంలో ఈ విషయాన్ని ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా చెప్పింది. ఆ కోవలోనే ఓ యంగ్‌ డైరెక్టర్‌తో తన తమ్ముడి తెరంగేట్రానికి రకుల్‌ స్కెచ్‌ వేసినట్లుగా తెలియవస్తోంది. తెలుగులోనే అమన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారమ్‌. రకుల్‌ ఇలాంటి విషయాల్లో చాలా వైజ్‌గా ఆలోచిస్తుంటుంది. తనకు ఎక్కువగా తెలుగులోనే ఫాలోయింగ్‌ ఉంది. సో ఇక్కడే తన తమ్ముడికి కూడా స్లాట్‌ బుక్‌ చేస్తే మంచిదని రకుల్‌ అభిప్రాయం. అందుకే ఒక పక్క హీరోయిన్‌గా రాణిస్తూనే, ఇంకో వైపు ఫిట్‌నెస్‌ బిజినెస్‌లోకి అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో పలు ఫిట్‌నెస్‌ స్టూడియోస్‌ని ప్రారంభించేసింది రకుల్‌. ఈ రకంగానూ రకుల్‌ తెలుగు ప్రేక్షకులకు అత్యంత సన్నిహితంగా ఉంటోంది. రకుల్‌ తమ్ముడు కూడా తక్కువోడేం కాదులెండి, ఈలోగా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరితోనూ సన్నిహిత సంబంధాలు పెంచుకుంటున్నాడట. డ్రగ్స్‌, సెక్స్‌ వంటి అంశాల చుట్టూ ఈ 'రాక్‌ అండ్‌ రోల్‌' షార్ట్‌ ఫిలిం సాగుతుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌ ఇది. అందుకే ఈ షార్ట్‌ ఫిలిం ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తోంది.

 

ALSO READ: వదంతుల పై క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్