ENGLISH

బ‌హ‌ద్దూర్‌గా రామ్ చ‌ర‌ణ్‌??

24 April 2017-12:21 PM

క‌న్న‌డ‌లో ఇటీవ‌ల ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం బ‌హ‌ద్దూర్‌. ఈ సినిమా రీమేక్ రైట్స్ విష‌యంలో గ‌ట్టి పోటీ నెల‌కొంది. అయినా స‌రే.. భారీ రేటు చెల్లించి గీతా ఆర్ట్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని కొనుగోలు చేసింది. గీతా ఆర్ట్స్ అంటే హీరోల‌కు కొద‌వ‌లేదు. దాంతో ఈ సినిమా ఎవ‌రి తో చేస్తార‌న్న ఆస‌క్తి మొద‌లైంది. అల్లు అర్జున్‌, శిరీష్ ల‌లో ఒక‌రితో ఈసినిమా చేయ‌డం ఖాయం అనుకొన్నారంతా. కానీ.. ఇప్పుడు ఆ ఛాన్స్ రామ్ చ‌ర‌ణ్‌కి వెళ్లింద‌ని తెలుస్తోంది. మ‌గ‌ధీర‌, ధృవ సినిమాలు గీతా ఆర్ట్స్ నుంచే వ‌చ్చాయి. చ‌ర‌ణ్‌కి చాలా అచ్చొచ్చిన సంస్థ అది. అందుకే.. గీతా ఆర్ట్స్‌లోనే బ‌హ‌ద్దూర్‌ని చ‌ర‌ణ్‌తో చేయాల‌ని అల్లు అర‌వింద్ ఫిక్స్ అయ్యార‌ని వినికిడి. 

ALSO READ: బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన ప్రభాస్‌