ENGLISH

రాజమౌళి అందానికి వర్మ 'ఫిదా'

24 April 2017-11:28 AM

దర్శక ధీరుడు రాజమౌళి అందాన్ని కొనియాడారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన మనసు లోతులనుంచి ఈ మాటలొచ్చినాగానీ, వర్మ అంటేనే సంచలనం కదా, అందుకే ఇందులోంచి కూడా పెడార్ధాలు తీయడానికి నెటిజన్లు వెనుకాడ్డంలేదు. రామ్‌గోపాల్‌ వర్మ, రాజమౌళితో ఉన్న ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి తనకంటే అందగాడని చెప్పారు. అయితే తాను అసహ్యంగా ఉన్నట్లు వర్మ పేర్కొనడం గమనించదగ్గ అంశం. ఇలాంటి వ్యాఖ్యలు వర్మ మాత్రమే చేయగలరు. ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌ వర్మ ఏ పోస్టింగ్‌ పెట్టినా అది క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. ఈ పోస్టింగ్‌ కూడా అలాగే వైరల్‌ అయిపోయింది. 'బాహుబలి ది కంక్లూజన్‌' విడుదలకు దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్‌గా 'బాహుబలి' టీమ్‌ విడుదల చేసిన 'సాహోరే బాహుబలి' వీడియో ప్రోమోని అభినందించారు రామ్‌గోపాల్‌ వర్మ. ఓ దర్శకుడు, ఇంకో దర్శకుడ్ని అభినందించడం చాలా గొప్ప అంశం. అయితే ఇక్కడ రాజమౌళి అందాన్ని వర్మ పొగడటం వెనుక ఇంకో కోణాన్ని చాలా తక్కువమందే గమనిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే రాజమౌళి గొప్పతనం. అదే ఆయన అందం. అవును, దర్శ ధీరుడైనప్పటికీ దేశం తన గురించి అంతలా చర్చించుకుంటున్నప్పటికీ రాజమౌలి డౌన్‌ టు ఎర్త్‌ అన్నట్లుగానే ఉంటారు. ఆ అందాన్నే రామ్‌గోపాల్‌ వర్మ అభినందించారని అర్థం చేసుకోవాలి.

ALSO READ: సుమ కనకాల పై సెటైర్ వేసిన chiru