ENGLISH

నేనే రాజు నేనే మంత్రిలో ‘ఆ’ డైలాగ్ కి అనూహ్య స్పందన

12 August 2017-15:49 PM

హీరో రానా నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో పెద్ద హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో తేజ దర్శకత్వం, రానా యాక్టింగ్ తో పాటుగా అందరు మాట్లాడుకుంటున్న మరో అంశం- డైలాగ్స్.

లక్ష్మి భూపాల్ రాసిన డైలాగ్స్ ఈ మొత్తం చిత్రానికే హైలైట్ గా నిలిచాయి. రిపీట్ ఆడియన్స్ రావడానికి ఇదొక బలమైన కారణం అని అందరు చెబుతున్నారు.

ముఖ్యంగా అందులో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో ఉన్న నటుడు చెప్పిన డైలాగ్ ధియేటర్ లో ఉన్న ప్రతిఒక్కరితో చప్పట్లు కొట్టిస్తుంది. ఆ డైలాగ్ ఇదే-

“సినిమాల్లో నటించే ఒక మహానుభావుడు పార్టీ పెడితే అక్కడా మేమే. ఒక మాస్ హీరో పార్టీ పెడితే అక్కడా మేమే. విప్లవ భావజాలం ఉన్నాయన పార్టీ పెట్టినా అక్కడా మేమే. ఇంకెవరన్నా రేపు కొత్తగా పార్టీ పెట్టినా అక్కడా మేమే. ఏ పార్టి గెలిచినా ఏ కొత్త నేత వచ్చి పార్టీ పెట్టినా.. మేం మాత్రం ఎప్పుడూ అధికారంలో ఉంటాం”.

ఈ డైలాగ్ మన రాజకీయ పరిస్థితికి అచ్చంగా అద్దంపట్టేదిలా ఉండడంతో అందరు ఈ డైలాగ్ కి ఫిదా అవుతున్నారు.

 

ALSO READ: నేనే రాజు నేనే మంత్రి మొదటిరోజు కలెక్షన్స్


mobile app