ENGLISH

భ్రమరాంబ తెగ నచ్చేస్తోంది

27 May 2017-13:35 PM

'భ్రమరాంబ' ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ పేరు మార్మోగిపోతోంది. అంతగా ఈ పాత్ర జనంలోకి వెళ్లిపోయింది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాత్ర పేరే ఈ భ్రమరాంబ. సినిమాకే హైలైట్‌ భ్రమరాంబ పాత్ర. సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఈ భ్రమరాంబే ఎక్కువగా సందడి చేస్తోంది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందకు వచ్చింది. మంచి టాక్‌ అందుకుంది. భ్రమరాంబగా రకుల్‌ నటన మరీ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్‌ లుక్‌లో ఎట్రాక్ట్‌ చేస్తున్నా, గ్లామర్‌లో కూడా ఏమాత్రం తగ్గలేదంటోంది ముద్దుగుమ్మ రకుల్‌. ఇమేజ్‌ పరంగా ఇదో పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అని చెబుతోంది రకుల్‌. ఇంతవరకూ మోడ్రన్‌ దుస్తుల్తో గ్లామర్‌ లుక్స్‌లో అలరించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ సినిమాలో అచ్చమైన తెలుగమ్మాయిలా పూర్తిగా తనను తాను చూసుకున్నానని చెబుతోంది రకుల్‌. రకుల్‌కి తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టం ఈ సినిమాతో మరింత పెరిగిందంటోంది. డైరెక్టర్‌ దగ్గర్నుంచీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ వరకూ ఈ సినిమాలో భ్రమరాంబ పాత్రపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఆ పాత్రని అంత బాగా డిజైన్‌ చేశారు. వారి సూచనల మేరకే ఈ పాత్ర కోసం రకుల్‌ కూడా ఎంతగానో కష్టపడిందంటోంది. తెలుగమ్మాయిలా కనిపించడమే కాదు, అలా కనిపించేందుకు తన వేషంతో పాటు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ మార్చుకుందట రకుల్‌. అందుకే అంతగా భ్రమరాంబ అందరికీ నచ్చేసింది. అంతేకాదు భ్రమరాంబగా తనకిే తానే ఎంతగానో నచ్చేశానంటోంది క్యూట్‌ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

 

ALSO READ: చైతు సినిమా రెస్పాన్స్ కి సమంతా డ్యాన్సులు