ENGLISH

'రాజా ది గ్రేట్‌' అట్నించి ఇటొచ్చింది

17 October 2017-20:36 PM

రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం 'రాజా ది గ్రేట్‌'. న్యూ కాన్సెప్ట్‌, హీరో అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ స్టోరీ మొదట్లో యంగ్‌ హీరో రామ్‌ దగ్గరికి వెళ్లిందట. కొన్ని కారణాలతో రామ్‌కి చేయడం కుదరకపోవడంతో, మాస్‌ రాజా రవితేజ దగ్గరికి వచ్చిందట. ఈ విషయం ఈ సినిమా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి చెప్పాడు.. అయినా సినీ రంగంలో ఇలాంటివి చాలా కామన్‌. ఒక హీరో కోసం అనుకోవడం, కుదరకపోతే, ఇంకో హీరోతో ఆ సినిమా తెరకెక్కడం, అనూహ్యంగా ఆ సినిమాలు సూపర్‌ సక్సెస్‌ అవ్వడం లాంటివి సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. గతంలో 'పటాస్‌' చిత్రం రవితేజ చేయాల్సింది. మిస్‌ కావడంతో అది కళ్యాణ్‌రామ్‌ చేతికి వెళ్లడం పెద్ద సక్సెస్‌ అవ్వడం జరిగిపోయాయి. అలాగే 'అర్జున్‌ రెడ్డి' సినిమా కూడా అంతే. మొదట శర్వానంద్‌ దగ్గరికి వెళ్లిందట ఆ కాన్సెప్ట్‌. ఆ క్యారెక్టర్‌లో అభిమానులు తనను చూడలేరంటూ, శర్వానంద్‌ కాదనడంతో విజయ్‌ దేవరకొండతో తెరకెక్కి, సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. కాగా 'రాజా ది గ్రేట్‌' సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఏడాదికి రెండు మూడు సినిమాలతో వచ్చే రవితేజ రెండేళ్ల లాంగ్‌ గ్యాప్‌ తర్వాత చేస్తున్న సినిమా ఇది. దాంతో మాస్‌ మహరాజ్‌ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. అంచనాలు కూడా బాగున్నాయి ఈ సినిమాకి. ప్రమోషన్‌ కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. హీరోయిన్‌ మెహరీన్‌ క్యూట్‌గా హాట్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది. అన్నట్లు రవితేజ వారసుడు మహాధన్‌ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. రవితేజ చిన్నప్పటి పాత్రలో మహాధన్‌ నటిస్తున్నాడు.

ALSO READ: వర్మతో స్క్రీన్‌ప్లే రాయిస్తున్న స్వర్గీయ ఎన్టీఆర్‌!