ENGLISH

గ్లామ్‌షాట్‌: కలర్‌ ఫుల్‌ 'నక్షత్రం'

29 May 2017-11:36 AM


అందాల రెజీనా ఏ కాస్ట్యూమ్‌లోనైనా అందమే. అదీ ఈ రంగు రంగుల కాస్టూమ్‌లో నక్షత్రాన్ని మించిన బ్రైట్‌నెస్‌తో మెరిసిపోతోంది. ప్రస్తుతం 'నక్షత్రం' సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో రెజీనా యాక్షన్‌ సీన్స్‌లో కూడా అలరించనుంది. ఈ సినిమా కోసం కొంచెం బొద్దుగా ముద్దుగా మారిన రెజీనా ఇదిగో ఈ కొత్త లుక్‌లో ఇలా ఎట్రాక్ట్‌ చేస్తోంది. అమ్మడు బాలీవుడ్‌లోనూ సత్తా చాటబోతోంది. 'ఆంఖేన్‌ 2'లో రెజీనా తన అందాలతో ఆకట్టుకోనుంది. తెలుగులో కూడా రెజీనా చేతిలో పలు సినిమాలున్నాయి. ప్రస్తుతం రెజీనా, తెలుగుతో పాటు, తమిళ, హిందీ సినిమాలతోనూ ఫుల్‌ బిజీగా గడుపుతోంది.

ALSO READ: Qlik Here For More Pics << Regina