ENGLISH

నిర్మాతలకి చుక్కలు చూపిస్తున్న అనసూయ?!

15 December 2017-18:45 PM

జబర్దస్త్ కామెడీ షోతో జబర్దస్త్ యాంకర్ అనిపించుకున్న అనసూయ తరువాతి కాలంలో మంచి నటిగా మెప్పించిన సంగతి కూడా విదితమే. ఒక్క మాటలో చెప్పాలంటే- అనసూయకి మంచి ఫాలోయింగ్ ఉంది తెలుగునాట అని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు.

అయితే ఈ మధ్యకాలంలో ఆమె పైన నిర్మాతల ఒకింత అసహనానికి లోనవుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల వినికిడి. దానికి కారణం ఏంటి అని విచారించగా- ఒక షో కి యాంకరింగ్ చేయడానికి ఆమె ఇంతకముందు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కాస్తా ఆమాంతం పెంచేసిందట! అదే కాకుండా ఆ రెమ్యునరేషన్ ఏ స్థాయిలో అంటే యాంకరింగ్ లో రారాణి గా వెలుగుతున్న ప్రముఖ యాంకర్ రెమ్యునరేషన్ ని మించేలా డిమాండ్ చేస్తున్నదట. 

ఇవే కాకుండా సదరు ఈవెంట్స్ కి వాడే కాస్టూమ్స్ రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో అనసూయ పైన నిర్మాతలకి ఒకింత అసహనం పెరిగిపోతున్నదట. అయితే ఇవన్ని ఒట్టి పుకార్లు మాత్రమేనని, కేవలం కొంతమంది కావాలనే ఇటువంటివి సృష్టిస్తున్నారు అని అనసూయ అభిమానులు స్పష్టం చేస్తున్నారు.

ఇంతకీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కాని ఇటువంటి కామెంట్స్ అనసూయకి ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంది.

 

ALSO READ: 'సీత' రాముని కోసం మూవీ రివ్యూ & రేటింగ్స్