ENGLISH

టాక్ అఫ్ ది వీక్- విజేత, RX 100 & చినబాబు

15 July 2018-13:19 PM

ఈ వారం విడుదలైన చిత్రాలలో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా ఒకటి మాత్రం తమిళ డబ్బింగ్ చిత్రం. అయితే ఆ డబ్బింగ్ చిత్రం లో హీరో కార్తి అవ్వడంతో ఆ చిత్రానికి కూడా స్ట్రెయిట్ సినిమాకి ఉండే ఫాలోయింగ్ దీనికి కూడా వచ్చింది.

ఇక ముందుగా ఈ వారం సంచలనానికి దారి తీసిన RX 100 గురించి మాట్లాడుకుందాం... ఈ సినిమా ట్రైలర్, టీజర్స్ ప్రేక్షకులని ఆకర్షించడంలో విజయం సాధించడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. దానికి తోడు సినిమా కూడా ప్రేక్షకులకి నచ్చడంతో రోజురోజుకి ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరుగుతున్నాయి.

కథ పరంగా కూడా ఈ చిత్రం కాస్త వైవిధ్యంగా ఉండడం, దర్శకుడు కూడా ఈ చిత్రాన్ని వాస్తవికతకి దగ్గరగా తీయడం, నటీనటుల నటన ఇవన్ని ఈ చిత్రాన్ని ఘనవిజయం సాధించేలా చేశాయి. ఈ సంవత్సరం వచ్చిన చిన్న సినిమాలలో పెద్ద విజయం అందుకున్న చిత్రంగా ఇది నిలుస్తుంది.

ఈ వారం విడుదలైన రెండవ చిత్రం- విజేత. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు అయిన కళ్యాణ్ దేవ్ ఈ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. అయితే మెగా కాంపౌండ్ హీరోల మాదిరిగా మాస్ మసాలా చిత్రంతో కాకుండా ఒక చక్కటి ఫ్యామిలీ చిత్రంతో ప్రేక్షకుల ముందికి వచ్చాడు.

తండ్రి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాల కళ్ళకి కట్టినట్టుగా చూపెడుతూ ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా చూపించాడు దర్శకుడు రాకేశ్ శశి. ఈ సినిమాతో అయితే కళ్యాణ్ ఒక మంచి చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు అని మాత్రం చెప్పగలం.

జాబితాలో ముచ్చటగా మూడవ చిత్రం చినబాబు. కార్తికి తెలుగులో ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు అదే సమయంలో ఖాకీ చిత్రం ఇక్కడ హిట్ అవ్వడంతో  ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, దర్శకుడు పాండిరాజ్ ముందు నుండి చేబుతున్నట్టుగానే ఇది ఒక సాధారణ కథ, ఒక సామాన్య కుటుంబంలో జరిగే అంశాలనే కథావస్తువులుగా చేసుకుని ఈ చిత్రాన్ని తీశాడు.
 

 

అయితే ఈ సినిమాలో తమిళ వాసనలు ఎక్కువగా ఉండడంతో మన ప్రేక్షకులకి ఇది అంతగా ఎక్కకపోవచ్చు. దీని భవిష్యత్తు ఈరోజు గడిస్తే కాని చెప్పలేం..

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 

ALSO READ: బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి నాని ఐస్ ఛాలెంజ్