ENGLISH

మెగా హీరో జోరు తగ్గలేదు గురూ!

19 February 2018-10:08 AM

ఓ సినిమా పరాజయం పాలైతే, ఇక అంతే సంగతులు. తర్వాతి సినిమా ఏంటో తెలియని పరిస్థితి స్టార్‌ హీరోలకే ఎదురవుతోంది. చిత్రమేంటంటే ఓ మెగా హీరోకి మాత్రం ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కెరీర్‌ దూసుకుపోతోంది. అతనెవరో కాదు, మెగా మేనల్లుడు 'సుప్రీం హీరో' సాయిధరమ్‌ తేజ్‌. వరుస పరాజయాల్లో రికార్డులు కొల్లగొట్టేస్తాడా? అన్నట్టుంది సాయిధరమ్‌ తేజ్‌ పరిస్థితి. 

ఇటీవల తేజూ కొల్లగొట్టిన తాజా ఫ్లాప్‌ 'ఇంటిలిజెంట్‌'. తేజు కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా దీన్ని అంతా గుర్తిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన 'తిక్క', 'విన్నర్‌', 'జవాన్‌' తదితర సినిమాల పరాజయాల్ని పట్టించుకోలేదుగానీ, 'ఇంటిలిజెంట్‌'తో కొంత దిగాలు పడ్డాడట తేజూ. అయితే ఫ్లాప్‌ని చూసుకుని కుంగిపోవడం కంటే, ఆ ఫ్లాప్‌ల నుంచి పాఠాలు నేర్చుకుని, సక్సెస్‌ కొట్టాలని, తదుపరి సినిమాలపై ఫోకస్‌ పెట్టాలనీ సన్నిహితులు ఇచ్చిన సూచన మేరకు మళ్ళీ ఉత్సాహంగా తన తదుపరి సినిమాల ప్రమోషన్‌లో బిజీ అయిపోయాడు తేజు.

 

ప్రస్తుతం కరుణాకరన్‌తో తేజూ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెల్సిందే. ఇది కాకుండా, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు తేజూ. తాజాగా కన్‌ఫామ్‌ అయిన చిత్రమిది. దీని తర్వాత మరో రెండు సినిమాలు లైన్‌లోకి వస్తాయట. పైకి ఎంత జోవియల్‌గా కన్పించినా, ఫెయిల్యూర్స్‌ తాలూకు టెన్షన్‌ మాత్రం తేజూలో స్పష్టంగా కన్పించేస్తోంది. ఎన్ని సినిమాలు చేశామన్న లెక్కల సంగతి పక్కన పెట్టి, ఎంత మంచి సినిమాలు చేస్తున్నామన్నదానిపై తేజూ ఫోకస్‌ పెట్టాల్సిన తరుణమిది. లేకపోతే 'సుప్రీం హీరో' అన్న ఇమేజ్‌, మెగా హీరో అన్న ఇమేజ్‌ దెబ్బతినేసే ప్రమాదముంది.

ALSO READ: గుండు హనుమంతరావు ఇక లేరు