ENGLISH

మార్పుకి ఇదే 'సాక్ష్యం'

19 October 2017-17:48 PM

శ్రీవాస్‌ దర్శకత్వంలో సినిమాలన్నీ కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కినవే. కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా శ్రీవాస్‌ పేరు దక్కించుకున్నాడు. ఈసారి విలక్షణతతో కూడిన సినిమా తెరకెక్కించబోతున్నాడట. అందుకు ఇదిగో 'సాక్ష్యం' అంటున్నాడీ దర్శకుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ తెరకెక్కిస్తోన్న 'సాక్ష్యం' సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. పోస్టర్‌తోనే ఇదొక విభిన్నమైన సినిమా అనే సంకేతాలిచ్చాడు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కూడా ఇప్పటిదాకా చేసినవన్నీ కమర్షియల్‌ సినిమాలే. ఈసారి ఈ యువ హీరో కూడా ప్రయోగాల బాట పట్టాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ప్రయోగాల హవా కొనసాగుతోంది. స్టార్‌ హీరోల మొదలు, యంగ్‌ హీరోల దాకా ప్రయోగాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆడియన్స్‌ కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ కొత్తదనాన్వివ్వడానికే హీరోలంతా ట్రై చేస్తున్నారు. డైరెక్టర్స్‌ కూడా కొత్త రకం కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అదే పంథాని యంగ్‌ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కూడా వెతుక్కున్నాడనిపిస్తోంది. ఇటీవలే 'జయ జానకీ నాయకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. యాక్షన్‌ హీరోగా తనేంటో సత్తా చాటాడు. డాన్సుల్లోనూ సూపర్‌ అనిపించుకున్నాడు మనోడు. ఇక ప్రయోగాల ద్వారా తన టాలెంట్‌ ఏంటో నిరూపించాలనుకుంటున్నాడు కాబోలు బెల్లంకొండ. 'సాక్ష్యం' ద్వారా రాబోతున్నాడు. ఓ డిఫరెంట్‌ అనుభూతిని ఈ సినిమా ద్వారా ఇస్తానంటున్నాడు. అదేంటో తెరపైనే చూడాలట. 'ముకుంద', 'డిజె' చిత్రాల ఫేం పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: నాని - నేలమీద నిలబడ్తాడు