ENGLISH

కన్నడిగులకు 'కట్టప్ప' క్షమాపణలు

21 April 2017-15:57 PM

కర్నాటకలో సత్యరాజ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమాని విడుదల కానివ్వబోమని కన్నడిగులు శపథం చేసేశారు. ఈ వివాదంపై రాజమౌళి ఇప్పటికే స్పందించి, కన్నడిగులకు సినిమా అడ్డుకోవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. కన్నడ భాషలో రాజమౌళి చేసిన అప్పీల్‌ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇంకో వైపున వివాదానికి ముగింపు పలకాలంటూ సత్యరాజ్‌పైన కూడా 'బాహుబలి' టీమ్‌ ఒత్తిడి తెచ్చిందట. దాంతో సీనియర్‌ నటుడు అయినప్పటికీ సత్యరాజ్‌ కూడా ఎంతో హుందాగా వ్యవహరించాడు. కన్నడిగులకు క్షమాపణ చెప్పాడు

 

తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరాడు. కన్నడిగులంటే తనకెంతో గౌరవమని చెప్పాడు. తొమ్మిదేళ్ళ క్రితం కావేరి జలాల విషయంలో అప్పటి చాలా మంది నటీనటులు స్పందించి, తమదైన రీతిలో వ్యాఖ్యానించారు. అలాంటిది ఇన్నాళ్ల తర్వాత సత్యరాజ్‌ నటించిన 'బాహుబలి ది కన్‌క్లూజన్‌' సినిమా విషయంలోనే వివాదం చెలరేగడం ఆశ్యర్యంగా ఉంది. అయితే ఇంతవరకూ కూడా సత్యరాజ్‌ కన్నడంలో పలు చిత్రాల్లో నటించారు. ఒకవేళ తన వాదన తప్పంటే, కన్నడ దర్శక, నిర్మాతలు తనని సినిమాల్లో పెట్టుకోవద్దని ఆయన అన్నారు. కానీ తమిళ ప్రజలంటే తనకెంతో అభిమానమనీ, వారి కోసం తన వాదనని ఎప్పటికీ వినిపిస్తానని మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్పారు. మొత్తానికి సత్యరాజ్‌ క్షమాపణ చెప్పడం ద్వారా కన్నడిగులు కొంత మేర శాంతిస్తారని భావించాలి. 

ALSO READ: లంక మూవీ రివ్యూ & రేటింగ్స్