ENGLISH

శింబు 'సరసుడే' సుమీ

22 April 2017-18:48 PM

నయనతార, శింబు ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో హాట్‌ జంట. వీరిద్దరి మధ్య ఎఫైర్‌ గురించి తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో కథలు కథలుగా చెప్పుకున్నారు. అంతకు ముందు, ఆ తర్వాత ఇంత హాట్‌గా ప్రచారంలోకొచ్చిన సినీ జంట ఇంకొకటి లేదనడం అతిశయోక్తి కాదేమో. అంతలా వీరి ప్రేమ గురించి ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరి ప్రైవేట్‌ మూమెంట్స్‌కి సంబంధించిన స్టిల్స్‌ విడుదలయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ విడిపోయారు. తిరిగి వీరిద్దరూ సినిమాల్లో నటిస్తారా? లేదా? అని ఇద్దరి అభిమానులూ ఎంతో కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. అంతకు ముందు 'వల్లభ' సినిమా కోసం వీరిద్దరూ కలిసి నటించారు. అందులో శింబు - నయన ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ రియల్‌ లైఫ్‌ రొమాన్స్‌ని తలపించింది. కొంత గ్యాప్‌ తర్వాత శింబు, నయనతార కలిసి నటించిన సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే 'సరసుడు'. టైటిల్‌ అదిరిపోయింది కదా? ఈ సినిమాలో నయనతార మాత్రమే కాదు అందాల భామలు ఆండ్రియా, ఆదా శర్మ కూడా నటిస్తుండడం చెప్పుకోదగ్గ అంశం. ఈ సినిమాకి సంబంధించి పాటల్ని కెడనాలో చిత్రీకరించారు. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే శింబు సోదరుడు టిఆర్‌కురళ అరసన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించడం. శింబు తండ్రి రాజేందర్‌ ఈ చిత్రానికి నిర్మాత.

ALSO READ: కొడుకు విడాకుల సంగతి భయటపెట్టిన ప్రముఖ నటుడు