ENGLISH

'బిగ్‌బాస్‌' మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ శివ బాలాజీ

25 September 2017-11:30 AM

70 రోజుల్నుంచీ కంటిన్యూస్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిగ్‌ గేమ్‌ షో 'బిగ్‌బాస్‌' విన్నర్‌ ఎవరో తెలిసిపోయింది. ఆధ్యంతం ఆశక్తిగా జరిగిన 'బిగ్‌బాస్‌' గేమ్‌ షోలో విజేతగా హీరో శివ బాలాజీ నిలిచారు. శివబాలాజీకి కోపమెక్కువ. మాటల్లో దూకుడెక్కువ. కానీ అవన్నీ అణచుకుని మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా నిలిచాడు. ఆ అణకువే ఆయన్ని 'బిగ్‌బాస్‌' విజేతగా నిలబెట్టింది. బిగ్‌బాస్‌ షో నుండి చాలా నేర్చుకున్నాననీ ఆయన తెలిపారు. చాలా సందర్భాల్లో కోపానికి గురైనప్పటికీ, దాన్ని నియంత్రణ చేసుకోగలగడం తెలిసిందంటే అది 'బిగ్‌బాస్‌' షో వల్లే అన్నారు నటుడు శివ బాలాజీ. రన్నరప్‌గా నిలిచిన మరో నటుడు ఆదర్శ్‌ అంటే విలన్‌గానే తెలుసు మనకి ఇన్నాళ్లుగా. అలాంటిది ఈ షో ద్వారా హీరోగా నిలిచాడు. 'బిగ్‌బాస్‌' షో ద్వారా తన ఒరిజినల్‌ ఆటిట్యూడ్‌ని ప్రేక్షకులకి తెలియజేసే అవకాశం లభించింది. చివరి వరకూ శివ బాలాజీకి గట్టి పోటీగా నిలిచాడు ఆదర్శ్‌. మొత్తానికి 'బిగ్‌బాస్‌' గ్రాండ్‌ ఫినాలే ఘనంగా జరిగింది. మొదటి సీజన్‌ చక్కగా ముగిసింది. 14 మంది పార్టిసిపెంట్స్‌ ప్లస్‌ 2 వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీస్‌తో టోటల్‌ 16 మంది హౌస్‌ మేట్స్‌తో బుల్లితెర బిగ్‌ షో 'బిగ్‌బాస్‌' ఎంటర్‌టైనింగ్‌గా ముగిసింది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ఈ షోని ఇంత ఘనంగా నిర్వహించారు.

ALSO READ: ఈ వార్తని ఇంగ్లీష్ లో చదవడానికి క్లిక్ చేయండి