ENGLISH

నేచురల్‌ 'నల్లత్రాచు' ఎవరు?

19 June 2018-11:29 AM

శ్రీరెడ్డి మళ్లీ ఫైర్‌ అయ్యింది. ఈ సారి ఎవరి మీదా.? అంటారా? ఇంకెవరి మీదా..? ఈ దాహం తీరనిది అనే రేంజ్‌లో శ్రీరెడ్డి నేచురల్‌ స్టార్‌ నానిని టార్గెట్‌ చేసింది. నాని కామాంధుడు అంటూ మొన్న ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి, తన భర్త మంచోడు అన్నందుకు నాని భార్యను కూడా వదలలేదు. అంతేనా, ఇంకా నోటికి వచ్చినట్లు ధూషణలు చేస్తూనే ఉంది. బూతులు తిడుతూనే ఉంది. 

తాజాగా సోషల్‌ మీడియాలో 'నేచురల్‌ నల్లత్రాచు' అంటూ ఓ పోస్ట్‌ పెట్టింది. ఏదో ఒక రకంగా నానిని టార్గెట్‌ చేస్తూనే ఉంది. ఆల్రెడీ నాని తనపై శ్రీరెడ్డి చేస్తున్న అనవసర ఆరోపణలకు లీగల్‌ నోటీసులిచ్చాడు. అయినా కానీ శ్రీరెడ్డి ఆపట్లేదు. ఆధారాలు చూపించకుండా, నోరుంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. మరి శ్రీరెడ్డి టార్గెట్‌ ఏంటి? నానినే ఎందుకు డైరెక్ట్‌గా టార్గెట్‌ చేస్తోంది.? నాని నుండి ఆమె ఏం కోరుకుంటోంది? ఆమెని ఎవ్వరూ పట్టించుకోకపోయినా, సోషల్‌ మీడియా వేదికగా పబ్లిసిటీ స్టంట్‌ చేస్తూనే ఉంది. 

ప్రస్తుతం అమెరికాలో టాలీవుడ్‌ హీరోయిన్స్‌ సెక్స్‌ రాకెట్‌కి సంబంధించి శ్రీరెడ్డి స్పందించింది. ఆ సెక్స్‌ రాకెట్‌లో ఉన్నవాళ్లెవరో నాకు తెలుసు? త్వరలోనే వారందరి పేర్లు బయటకొస్తాయి.. అని శ్రీరెడ్డి చెబుతోంది.

 

ALSO READ: అనసూయని విచారించిన ఇంటర్ పోల్?!