ENGLISH

శివగామి పాత్ర కోసం శ్రీదేవి ఎంత అడిగిందో తెలుసా!

29 May 2017-12:55 PM

శివగామి పాత్రకి దక్కిన పేరు ప్రఖ్యాతలు గురించి పెద్దగా చెప్పకర్లేదు. ఇక ఆ పాత్ర కోసం నటి శ్రీదేవిని సంప్రదించినట్టుగా వస్తున్న వార్తలని రాజమౌళి సమర్దించాడు.

ఆ పాత్ర కోసం రమ్యకృష్ణని ముందు అనుకున్నా, సినిమా మార్కెట్ పెంచేదానిలో భాగంగా శ్రీదేవిని సంప్రదించారట. అయితే, శ్రీదేవి పెట్టిన కండిషన్స్ కి వీరు షాక్ అయ్యారట! అవేంటంటే- రెమ్యునరేషన్ 8 కోట్లు, హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఆమెకి ఆమె స్టాఫ్ కి ఫైవ్ స్టార్ హోటల్లో 5 రూమ్స్, అలాగే అప్ అండ్ డౌన్ 5 బిజినెస్ క్లాస్ టికెట్స్.

ఇన్ని కండిషన్స్ కి ఒప్పుకొని కూడా ముందుకి వెళదామనుకుంటే, హిందీ వెర్షన్ లో పర్సెంటేజ్ అడిగేసరికి ఇక ఆ ఆప్షన్ వదిలేసినట్టు చెప్పాడు.

అయితే ఇప్పుడు ఆ పాత్రకి వచ్చిన పేరు చూశాక, శ్రీదేవి కచ్చితంగా మంచి అవకాశం వదులుకున్నానని అనుకుని మాత్రం ఉండొచ్చు.

 

ALSO READ: నాకు అరవింది గారికి ఆ విషయంలో తేడా వచ్చింది: రాజమౌళి