ENGLISH

గ్లామ్‌ షాట్‌: ఓహో గులాబి బాలా!

22 September 2017-15:43 PM

ముద్దుగుమ్మ మెహరీన్‌ ప్రకృతి అందాల్ని చూసి మైమర్చిపోతున్నట్లుగా ఉన్న ఈ ఫోటో కేరళలోని సినిమా షూటింగ్‌లోనిది. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రాజా ది గ్రేట్‌' సినిమా సెట్‌లోనిది. ఈ పింక్‌ కలర్‌ డ్రస్సులో అమ్మడు అందంగా, అంతకన్నా అందమైన కేరళ అందాల్ని చూసి తన్మయత్వం ఫీలవుతుంటే, ఈ గులాబి రంగు డ్రస్సులో అమ్మడి అందాల్ని చూసి అభిమానులు మైమర్చిపోతున్నారు. ముద్దుగా, బొద్దుగా ఉండే అందంతో పాటు, కాస్త గ్లామరస్‌ లుక్‌ మెహరీన్‌ సొంతం. అందుకే ఆమె గ్లామర్‌కి కుర్రకారు మంత్ర ముగ్ధులవుతోంది. బయట పచ్చని ప్రకృతి, లోపల మెహరీన్‌ గ్లామర్‌ రెండూ పోటీ పడుతున్నట్లుగా లేవూ! త్వరలోనే ఈ బ్యూటీ 'మహానుభావుడు' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.

ALSO READ: Qlik Here More Pics