ENGLISH

సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా "చిలసౌ" ఫస్ట్ లుక్

18 March 2018-08:00 AM

సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం "చి ల సౌ". ఈ చిత్రాన్ని జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్నారు. 

సుశాంత్ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు (మార్చి 18) చిత్ర కథానాయకుడు సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జస్వంత్ నడిపల్లి మాట్లాడుతూ.. "సుశాంత్ హీరోగా "చిలసౌ" చిత్రాన్ని నిర్మిస్తూ చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. 

ప్రామిసింగ్ ఫిలిమ్ గా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రేపు మా హీరో సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. షూటింగ్ పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మే 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ALSO READ: అవునా! శ్రియ పెళ్లయిపోయిందా?